← Back to headlines

చెడ్డీ గ్యాంగ్ ల కంటే కాంగ్రెస్ గ్యాంగ్ డేంజర్: కెటిఆర్

2026-05-06 09:16 • original

వరంగల్: రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం నయవంచనకు పాల్పడిందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. రైతులకు 34 హామీలు ఇచ్చి నట్టేట ముంచిందని దుయ్యబట్టారు. వరంగల్ లో జరిగిన రైతు సంగ్రామ సదస్సులో కెటిఆర్ ప్రసంగించారు. నాలుగేళ్ల క్రితం వరంగల్ వచ్చిన రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ పేరుతో మోసం చేశారని, రైతుల రక్తం తాగిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు కిరీటం పెడతామని మభ్యపెట్టారన్నారు. 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి రుణమాఫీ జరిగిందని రైతులు చెబితే తాను రాజీనామా చేస్తానని కెటిఆర్ సవాల్ విసిరారు. రైతులకు ఇవ్వాల్సిన డబ్బులను ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకు కప్పం కడుతున్నారని ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి రెగ్యులర్ సిఎం కాదని, రెన్యువల్ సిఎం అని చురకలంటించారు. ఏ రేవంత్ రెడ్డి అంటే ఎగవేతల రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు.  నాలుగేళ్ల క్రితం కాంగ్రెస్ నుంచి కొందరు పెద్దలు వరంగల్ వచ్చారని, కాంగ్రెస్ నుంచి వచ్చిన వారిని పెద్దలు అనేకంటే దొంగలు అనొచ్చని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన కొందరు దొంగలు రైతులకు గాలం వేశారని, కాంగ్రెస్ కుట్రలు తెలిసి కూడా ఆ పార్టీని నమ్మారన్నారు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ సభ పెట్టినప్పుడే మాత్రం రైతు బంధు వేస్తున్నారని, చెడ్డీ గ్యాంగ్ ల కంటే కాంగ్రెస్ గ్యాంగ్ డేంజర్ అని కెటిఆర్ విమర్శించారు.