← Back to headlines

కోవిడ్ కంటే డేంజర్ హంతా వైరస్.... ముగ్గురు మృతి

2026-05-08 02:04 • original

హైదరాబాద్: కోవిడ్ ను మించిన వైరస్ విజృంభిస్తోందని ప్రపంచ దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది, హంతా వైరస్ చాలా డేంజర్ అని, ఇది శరవేగంగా వ్యాపిస్తుందని డబ్ల్యుహెచ్ఒ డైరెక్టర్-జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రేయెసస్ పేర్కొన్నారు.  వైరస్ నియంత్రణకు వివిధ దేశాలతో కలిసి పనిచేస్తామని వివరించింది. గురువారం డచ్ క్రూయిజ్ షిప్ లో హంతా వైరస్ బారినపడి ముగ్గురు మృతి చెందారు. షిప్ లో మొత్తం 23 దేశాలకు చెందిన 149 మంది ప్రయాణికులు  ఉన్నట్టు సమాచారం. హంతా వైరస్ వ్యాపించకుండా ఆయా దేశాలను అప్రమత్తం చేశామని డబ్ల్యుహెచ్ఒ తెలిపింది. ఎనిమది మందికి ఈ వైరస్ వ్యాపించినట్లు డబ్ల్యుహెచ్ఒ వైద్యాధికారులు తెలిపారు. ఐదు కేసులు హంటావైరస్ ఇన్ఫెక్షన్లుగా ప్రయోగశాలలో నిర్ధారించడ్డాయని మూడు కేసులు ఇంకా అనుమానితంగానే ఉన్నాయని తెలిపింది. వైరస్ పొదిగే కాలం ఆరు వారాల వరకు ఉండగలదని, మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉందని డాక్టర్ గెబ్రియేసస్ అన్నారు. హంటావైరస్‌లు సాధారణంగా సోకిన ఎలుకలు లేదా వాటి మూత్రం, లాలాజలం లేదా మలం ద్వారా వ్యాపిస్తాయని, వైరస్ వ్యాప్తికి ఆండెస్ వైరస్ కారణమని,  ప్రధానంగా లాటిన్ అమెరికాలో కనిపిస్తుందని, పరిమితంగా ఒకరి నుండి మరొకరికి వ్యాపించడానికి అనుమతించే ఏకైక హంటావైరస్ జాతిగా ప్రసిద్ధి చెందిందని వైద్యుడు గెబ్రియేసస్ తెలియజేశారు.