
మన తెలంగాణ/హైదరాబాద్: మహిళా స్వయం సహాయక సం ఘాల ఆర్థిక సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక ని ర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు అర్హత గల మహిళా సంఘాల కు అందిస్తున్న రూ.5 లక్షల వడ్డీ లేని రుణాల పరిమితిని ఇకపై రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. మహిళా సంఘాలు తీసుకునే రూ.10 లక్షల వరకు బ్యాంకు రు ణాలకు సంబంధించిన వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. జ్యోతిబాపూలే ప్రజాభవన్‌లో గురువారం నిర్వహించిన మహిళా స్వయం సహాయక బృందాల 202627 వార్షిక రుణ ప్రణాళిక ఆవిష్కరణలో మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్పెషల్ సీఎస్ దాన కిషోర్, సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్, స్త్రీనిధి డిప్యూటీ ఎండీ శ్రీనాథ్, ఎస్‌ఎల్బీసీ కన్వీనర్ సతీష్ కుమార్, ప్రముఖ బ్యాంకర్లు, అధికారులు, జిల్లా స మాఖ్య ప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. తొలుత మంత్రి సీతక్క జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం 2026.-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బ్యాంకు రుణ ప్రణాళికను ఆవిష్కరించా రు. ఈ ఏడాది మహిళా సంఘాలకు రూ.26,621.47 కో ట్ల రు ణ సదుపాయం కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న ట్లు వెల్లడించారు. గత 2025-.26 ఆర్థిక సంవత్సరంలో మహిళా సంఘాలకు రూ.25,228.89 కోట్ల బ్యాంకు రుణాలు అందించినట్లు తెలిపారు. గత రెండేళ్లలో రూ.40 వేల కోట్ల బ్యాంకు లింకేజ్ రుణాలు ఇవ్వాలని లక్షంగా పెట్టుకుంటే, రూ.60 వేల కోట్ల రుణాలు ఇచ్చినట్లు వెల్లడించారు. ఇదంతా మహిళా సం ఘాలు, బ్యాంకర్ల సహకారంతోనే సాధ్యమైందని వెల్లడించారు. నిర్మల్ జిల్లా జీరో ఎన్‌పిఆర్ సాధించడం గర్వకారణమని పే ర్కొంటూ జిల్లా డీఆర్డీఓ విజయలక్ష్మి, జిల్లా సమాఖ్య అధ్యక్షురా లు గంగవ్వను ప్రత్యేకంగా అభినందించారు. నిర్మల్ జిల్లా తరహాలోనే అన్ని జిల్లాలు నూరు శాతం రీపేమెంట్ సాధించాలని పి లుపునిచ్చారు. వడ్డీ వ్యాపారుల దోపిడీని చూడలేక తాను నక్సలైట్లలో చేరానని గుర్తు చేశారు.
బ్యాంకుల ద్వారా మహిళా సం ఘాలకు రుణాలిపిస్తూ వడ్డీ వ్యాపారుల దోపిడిని అడ్డుకుంటున్నామని వివరించారు. బ్యాంకులకు ప్రభుత్వమే గ్యారెంటీ ఇస్తున్నందున మహిళా సంఘాలకు రుణాలు ఇస్తే మీ డబ్బులకు పూ ర్తి భద్రత ఉంటుందని పేర్కొన్నారు. మహిళా సంఘాల రుణాల పై వడ్డీ భారం తగ్గించేందుకు ఈ ఏడాది ప్రభుత్వం రూ.2500 కోట్లను ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. మహిళల ఆర్థిక భారా న్ని తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అనంతరం రుణాల పంపిణీ, రీపేమెంట్లో ప్రతిభ కనబరిచిన జిల్లా డీఆర్డీఓ లు, జిల్లా సమాఖ్య అధ్యక్షులను మంత్రి సీతక్క సన్మానించారు.