
హైదరాబాద్: అర్ధరాత్రి మహిళా పోలీస్ కమిషనర్ సుమతి సంచలన ఆపరేషన్ చేపట్టారు. పోలీస్ కమిషనర్ గా ఛార్జ్ తీసుకున్న మొదటి రోజు ఫీల్డ్ లోకి దిగారు. అరాచకాల ప్లేస్ గా ఉన్న దిల్ షుక్ నగర్ బస్టాండ్ కు అర్ధరాత్రి ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఒంటరి గా పోలీస్ కమిషనర్ సుమతి వెళ్లారు. ఓ మహిళా కమిషనర్ గా కాకుండా సగటు మహిళా గా బస్టాండ్ లో బస్ కోసం నిల్చున్నారు. కమిషనర్ అని తెలియక సగటు మహిళకు ఎదురయ్యే వేధింపులు సుమతి ఫేస్ చేశారు. 40 మంది పోకిరీలు సుమతిని చుట్టుముట్టారు. అర్ధరాత్రి 12 గంటల నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు ఆపరేషన్ నిర్వహించారు. సుమతిని చుట్టుముట్టిన పోకిరిల్లో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారు. అందులోనూ మద్యం మత్తు, గంజాయి మత్తులో యువకులు ఉన్నారు. పెట్రోలింగ్ పోలీసులు 3 గంటల పాటు అటు వైపు కన్నెత్తి కూడా చూడలేదు. రకరకాల అసభ్య ప్రశ్నలతో సుమతిని పోలీసులు చుట్టుముట్టారు. అయినా మొక్కవోని ధైర్యంతో అలానే ఉండి అందరిని గమనించారు. చివరికి 3:30 కు బీట్ కానిస్టేబుల్ అటు వైపు వచ్చారు. మూడు రోజుల పాటు దిల్ షుక్ నగర్ బస్టాండ్ వైపు స్వయంగా నిఘా పెట్టారు. పోలీసులు 40 మంది పోకిరీలను అదుపులోకి తీసుకొని అందరికీ కౌన్సిలింగ్ నిర్వహించారు. చదువుకోవాల్సిన యువకులు రాత్రి వేళల్లో పోకిరి చేష్టలకు పాల్పడడం దారుణమైన విషయం. ఎక్కువగా హాస్టల్స్ ఉండే వాళ్లే ఈ తరహా పోకిరీలు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు.
