
అమరావతి: ఎటిఎం మెషిన్ ను దుండగులు ఎత్తుకెళ్లిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో జరిగింది. సాయిబాబా గుడి దగ్గర ఉన్న ఐడిఎఫ్ సి బ్యాంకు ఎటిఎం మెషిన్ ఉంది. నలుగురు దుండగులు ముఖానికి మాస్కలు పెట్టుకొని ఎటిఎం మెషిన్ కు తాడు కట్టి బయటకు లాగారు. నలుగురు కలిసి బొలెరో వాహనంలో దుండుగులు ఎటిఎం మెషిన్ ను తీసుకెళ్లారు. బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎటిఎం మెషిన్ తీసుకుని బత్తలపల్లి వైపు వెళ్లి పోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎటిఎం మెషిన్ చోరీ దృశ్యాలు సిసి కెమెరాలో రికార్డు అయ్యాయి. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.