
చెన్నై: టివికె చీఫ్ విజయ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. విజయ్ రెండు నియోజకవర్గాలలో గెలవడంతో ఒక నియోజకవర్గానికి రాజీనామా చేయనున్నారు. తిరుచ్చి ఈస్ట్ ఎంఎల్ఎగా ఆయన రాజీనామా చేస్తున్నట్టు సమాచారం. విజయ్ పెరంబూర్ ఎమ్మెల్యేగా కొనసాగనున్నాడు. తిరుచ్చి ఈస్ట్‌లో 27 వేల 416 ఓట్ల మెజార్టీతో విజయ్ గెలిచాడు. ఖాళీ అయిన స్థానం నుంచి త్రిష పోటీ చేసే అవకాశం ఉంది. తిరుచ్చి నుంచి త్రిషను గెలిపించి కేబినెట్ లోకి తీసుకొనున్నారు.
ఈసారి ఎన్నికలలో ప్రభుత్వ స్థాపనకు అవసరం అయిన మ్యాజిక్ ఫిగర్ 118ని దక్కించుకోవడంలో విజయ్ విఫలం అయ్యారు. అయితే ఆయనకు ఇతర పార్టీలతో పోలిస్తే అత్యధికంగా 108 స్థానాలు వచ్చాయి. అదీ ఎవరి మద్దతు లేకుండా ఈ విజయం దక్కింది. తాము ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం ఇస్తే సభలో తమ బల నిరూపణకు దిగుతామని విజయ్ గవర్నర్‌కు తెలియచేశారు. టివికెకె కాంగ్రెస్ పార్టీతో పాటు సిపిఐ, సిపిఎం, పిఎంకె పార్టీలు మద్దతు ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో టివికె(108), డిఎంకె(59), అన్నాడిఎంకె(47), కాంగ్రెస్(5), పిఎంకె(4), సిపిఐ(2), సిపిఎం(2), ఐయుఎంఎల్(2), విసికె(2), బిజెపి(1), డిఎండికె(1), ఎఎంఎంకెఎంఎన్ కెజడ్(1) పార్టీలు స్థానాలలో గెలుపొందారు.