నవతెలంగాణ – హైదరాబాద్ : విశాఖపట్నానికి చెందిన నటి అషురెడ్డి, ఆమె తల్లిపై ఎన్నారై వ్యాపారవేత్తను పెళ్లి పేరుతో మోసం చేశారన్న క్రిమినల్ కేసులో హైకోర్టు దర్యాప్తు నిలిపివేయడానికి నిరాకరించింది. లండన్‌లో ఉన్న తన కుమారుడిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.10.5 కోట్లు వసూలు చేశారని హైదరాబాద్‌కు చెందిన వై.సత్యనారాయణమూర్తి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో కఠిన చర్యలు తీసుకోకుండా మినహాయింపు ఇవ్వాలన్న అభ్యర్థననూ కోర్టు తిరస్కరించింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరిస్తూ, విచారణను జూన్ 9కి వాయిదా వేసింది.
The post అషురెడ్డి పిటిషన్‌లో స్టేకు హైకోర్టు నిరాకరణ appeared first on Navatelangana.