ప్రతిష్టంభనలో విజయ్ కి మద్దతు తెలిపిన పలు పార్టీలు గవర్నర్ తీరుపై ఆగ్రహం
చెన్నై:తమిళనాడు ప్రజల తీర్పును గవర్నర్ అవమానిస్తు న్నారని డీఎంకే, ఎంఎన్‌ఎం, వీసీకే, సీపీఐ పార్టీలు మండిపడ్డాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా విజయ్ చేత ప్రమాణస్వీకారం చేయించేందుకు గవర్నర్ అర్లేకర్ ససేమిరా అంటున్న విషయం తెలిసిందే. తనకు మెజారిటీ సభ్యుల మద్దతు ఉన్నదని చూపిన తర్వాతే ప్రభుత్వ ఏర్పటుకు విజయ్ ని ఆహ్వానిస్తానని ఆయన కుండబద్దలు కొట్టారు. గవర్నర్ చర్య ఆమోదయోగ్యం కాదని, ప్రజాతీర్పును అగౌరవపరచడమే అవుతుందని రాజకీయాలకు అతీతంగా పలు పార్టీలు మండిపడ్డాయి. మెజారిటీని నిరూపించుకోవాల్సింది సభలో కానీ గవర్నర్ ఎదుట కాదని అవి స్పష్టం చేశాయి. సినీనటుడు కమల్ హసస్ కూడా విజరుకు బాసటగా నిలిచారు. ‘ప్రజా తీర్పును గౌరవిస్తున్నానని నా సోదరుడు స్టాలిన్ ప్రకటించారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా పనిచేస్తామని చెప్పారు. ఆయన రాజకీయ పరిణితిని నేను గౌరవిస్తున్నాను. ప్రస్తుతం రాజ్యాంగ పదవులలో ఉన్న వారు కూడా అదే విధిని నిర్వర్తించాలి. ఇది డిమాండ్ కాదు. వారి రాజ్యాంగ కర్తవ్యాన్ని గుర్తు చేయడమే’ అని కమల్ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో తెలిపారు.
విజయ్ నేతృత్వంలోని టీవీకే 108 స్థానాలు గెలుచుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఆయనను ఆహ్వానించకపోవడమంటే తమిళనాడు ప్రజల తీర్పును అగౌరవపరచడమే అవుతుంది. ఎన్నికైన 233 మంది సభ్యులు ఇంకా ప్రమాణస్వీకారం చేయలేకపోతున్నారు. ఇది రాష్ట్రానికి అవమానం. ప్రజాస్వామ్యానికి నష్టదాయకం’ అని కమల్ తెలిపారు. ప్రమాణస్వీకారానికి విజయ్ ని అనుమతించాలని వీసీకే అధినేత తిరుమవలవన్ డిమాండ్ చేశారుకి లోక్‌భవన్‌లో విజయ్ మెజారిటీని నిరూపించు కోవాల్సిన అవసరం లేదని, ఆయన శాసనసభలో ఆ పని చేయ వచ్చునని అన్నారు. కాగా సభలో మెజారి టీని నిరూపించుకునేందుకు విజయ్ కి అవకాశం ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎం.వీరపాండ్యన్ రాష్ట్ర గవర్నరును కోరారు. అయితే బీజేపీ వితండవాదాన్ని ముందుకు తెస్తోంది. టీవీకేకు మెజారిటీ లేనందున గవర్నర్ ఎదుట దానిని నిరూపించుకోవాలని చెబుతోంది.
The post బల నిరూపణ సభలోనే appeared first on Navatelangana.