రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావు
సుజాతనగర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం సందర్శన
నవతెలంగాణ-కొత్తగూడెం
ధాన్యం తరుగు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని, అకాల వర్షం వల్ల రైతుల ఇబ్బంది పడకుండా టార్పలిన్ పట్టాలు అందజేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌రావు ప్రభుత్వాన్ని కోరారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సుజాతనగర్ మండల కేంద్రంలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. అనంతరం బచ్చలకూర శ్రీఁవాస్ రావు అధ్యక్షతన జరిగిన సభలో పోతినేని మాట్లాడుతూ గత నాలుగు రోజుల నుంచి తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించడం జరుగుతుందన్నారు. అకాల వర్షం వల్ల రైతు నష్ట పోతున్నాడని, కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని వెంటనే కాటా పెట్టి కొనుగోలు చేయాలని, గన్నీ సంచులు కొరత లేకుండా చూడాలని అన్నారు. రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ, రాష్ట్ర కమిటీ సభ్యుడు ధర్మా, జిల్లా కమిటీ సభ్యుడు నల్లగోపు పుల్లయ్య, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి వీర్ల రమేష్, చింతలపూడి సాయి కుమార్, గండమల భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.
The post తరుగు లేకుండాధాన్యం వెంటనే కొనాలి appeared first on Navatelangana.