← Back to headlines

రాజీనామా చేయను

2026-05-06 00:30 • original

కోల్‌కతా: బెంగాల్ ముఖ్యమంత్రి పదవికి తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని టి ఎంసి అధినేత్రి మమత బెనర్జీ మంగళవారం స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ఈ క్రమంలో టిఎంసి, ఓటమి, బిజెపికి భారీ మెజార్టీ పరిణామాల మధ్య మమత అసాధారణ రీతిలో వ్యవహరించడం కీలక పరిణామం అయింది. ఇది కూ డా ఓ ప్రజాతీర్పేనా? ఇది నిజాయితీతో జరిగిన ఎన్నికలు కావని, ఈ ఫలితం తా ను అంగీకరించేది లేదని మమత విలేకరుల సమావేశం పెట్టి తేల్చిచెప్పారు. ఓ కు ట్ర ప్రకారం, వ్యూహ రచనలతో చివరికి ఫలితం సృష్టించారని ఆమె ఆరోపించా రు. దాదాపుగా వంద సీట్లలో ఓట్ల లూఠీ అయింది. పైగా టోకున ఫలితాల హైజా క్ చేశారని విమర్శించారు. కౌంటింగ్ దశలో అనేక అవకతవకలు జరిగాయి. తమ పార్టీ ఏజెంట్లు అభ్యంతరం చెప్పినప్పుడు కావాలనే తీవ్ర జాప్యం తరువాత కౌం టింగ్‌కు దిగుతూ రావడం, మధ్య మధ్యలో కేంద్ర ఉద్యోగుల బృందాలు, బయట ఆవరణలోని కేంద్రీయ భద్రతా బలగాల ఉనికితో ఇంతవరకూ ఎప్పుడూ లేని విధంగా ఇప్పటి పోలింగ్ ఆ తరువాతి కౌంటింగ్ జరిగిందని,

పదవీ చ్యుతికి దిగాల్సిన సిఎం మమత బెనర్జీ తెలిపారు. తాను పదవి నుంచి వైదొలిగేది లేదని చెప్పా రు. నిజమైన ప్రజా తీర్పు కానప్పుడు తానెందుకు అటువంటి ప్రహసనం ముందు తలొగ్గాలని ప్రశ్నించారు. ఇప్పటి తీర్పు టిఎంసికి వ్యతిరేకంగా బిజెపి సాగించిన భారీ సుదీర్ఘకాలిక కుట్ర అని ఆరోపించారు. తాము ఎన్నికలలో పోటీకి దిగింది చివరికి బిజెపికి వ్యతిరేకంగా కాకుండా బిజెపి వెన్నుదన్నులున్న కేంద్ర ఎన్నికల సంఘంతో అని తెలిపారు. ఎన్నికల ఫలితాలను తారుమారు చేసిన నిర్వా కం ఎన్నికల సంఘానిదే కావడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి అన్నారు. రాజకీయ పార్టీలు పరస్పర పార్టీలతో పోటీ పడుతాయని, అయితే ఇక్కడ పరిస్థితి తారుమారయింద ని, ఓ రాజకీయ పార్టీ ఎన్నికల సంఘంతో తలపడాల్సి వచ్చిందన్నారు. పదే పదే చెపుతున్నా తాను రాజీనామా చేసేది లేదు. ఈ రాజీనామా ప్రసక్తే రాదని మమత తెలిపారు.


గవర్నర్‌ను కలిసేది లేదు ..జ్ఞానేశ్ కీలక విలన్

తాను రాజీనామా చేయను, తాను గవర్నర్ కార్యాలయం లోక్‌భవన్‌కు వెళ్లను అని స్పష్టం చేశారు. ఇప్పుడు తాను తన నిర్ణయం ప్రకటించానని ఇక వారు వారు ఎవరైనా కానివ్వడండి రాజ్యాంగనిబంధనల ప్రకారం ఏమైనా చేసుకోవచ్చు. ఎటువంటి చర్యకు దిగినా తాము ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని మమత తమ అత్యంత సన్నిహితులైన పార్టీ నేతల సమక్షంలో తెలిపారు. ఎన్నికల సంఘం వ్యవహారశైలితో చీకటి అధ్యాయం నెలకొందన్నారు. దీనిని తాము ఛేదించి తీరుతామన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి జ్ఞానేశ్ కుమార్ ప్రజల ప్రజాస్వామిక హక్కులను తక్కువ చేసి చూపుతున్నారని విమర్శించారు. తప్పుడు తీర్పుతో అధికారంలోకి వస్తున్నబిజెపి

ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ హింసకు పాల్పడిందని మమత ఆరోపించారు. పలు చోట్ల టిఎంసి కార్యాలయాలు ధ్వంసం అయ్యాయి. నేతలు కార్యకర్తలపై దాడులు జరిగాయని, భయోత్పాతం సృష్టించారని చెప్పారు. ఎన్నికల అనంతర హింసాకాండతో దెబ్బతిన్న ప్రాంతాల సందర్శనకు పది మందితో కూడిన నిజనిర్థారణ సంఘం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల ఫలితాల అంశంపై తనతో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, పలువురు ఇండియా కూటమి నేతలు ఫోన్‌లో మాట్లాడారని సంఘీభావం తెలిపారని వివరించారు. తాను ఇప్పుడు జాతీయ స్ఠాయిలో కేంద్రంలోని బిజెపితో తలపడేందుకు ముందుకు వెళ్లుతానని , ఇందుకు ఇండియా కూటమి వేదిక అవుతుందని మమత స్పష్టం చేశారు.

ఇవిఎంలలో గోల్‌మాల్ ..తారుమార్లు

తాను ఈ ఎన్నికలలో పూర్తి స్థాయిలో కేంద్ర ఎన్నికల సంఘం ఇవిఎంలతో కనికట్టు చేసిందని మమత ఆరోపించారు. ఇవిఎం తారుమారు జరిగిందని చెప్పగలనని , ఎక్కడైనా పోలింగ్ ప్రక్రియ తరువాత ఇవిఎంలలో 85 శాతం నుంచి 90 శాతం వరకూ ఛార్జింగ్ ఉంటుందా? అని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం బిజెపి పంతం నెగ్గించేందుకు ఇవిఎంలతో మాయాజాలానికి దిగిందని విమర్శించారు. కేంద్రంలోని బిజెపి నేతలు పోలింగ్ ముగిసిన వెంటనే బెంగాల్‌లో విజయోత్సవాల ఏర్పాట్లు, ప్రధాని మోడీ తాను బిజెపి గెలవనగానే ప్రభుత్వ ప్రమాణానికి వస్తానని చెప్పడం ఇవన్నీ కూడా అంతర్గత లోగుట్టు వ్యవహారాలని తెలిపార.