
మన తెలంగాణ/హైదరాబాద్: రసాయనాల తయారీలో ప్రపంచంలోని అతి పెద్ద సంస్థల్లో ఒ కటైన జర్మన్ దిగ్గజం బిఎఎస్ ఎఫ్ (బిఎఎస్‌ఎఫ్) హైదరాబాద్‌లో రెండు జిసిసిలను ఏర్పా టు చేసేందుకు ముందుకొచ్చింది. గ్లోబల్ డిజిటల్ హబ్, గ్లోబల్ సర్వీసెస్ హబ్‌ల పేరుతో నెలకొల్పే ఈ రెండు జిసిసిలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి అంగీకార పత్రం సమర్పించింది. మంగళవారం నాడు ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జర్మన్ కాన్సుల్ జనరల్ మైఖేల్ హాస్పర్‌ల సమక్షంలో బిఎఎస్ ఎప్ గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ అధ్యక్షుడు టోబియాస్ డ్రాట్ తె లంగాణ లైఫ్ సైన్సెస్ సిఇఒ సర్వేశ్ సింగ్‌కు లెట ర్ ఆఫ్ ఇంటెంట్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ఈ ఏడాది 100 జిసిసిల ఏర్పాటును లక్ష్యంగా పెట్టుకున్న ట్టు వెల్లడించారు. వీటి ద్వారా లక్ష మంది ఐటి నిపుణులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపారు. హైదరాబాద్ కేవలం కార్యాలయాల కేం ద్రంగా మాత్రమే కాకుండా, ఆవిష్కరణలు, ఇం జినీరింగ్ రంగాల్లో ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు.
ఇందులో భాగం గా కృత్రిమ మేథస్సు ఆధారిత కేంద్రం ఐకామ్, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, 200 ఎకరాల్లో ఏఐ సిటీ, క్వాంటమ్ హబ్, జీవ విజ్ణాన పరిశోధన్ సంస్థ 1 బయోల్యాబ్ లను ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. 160 సంవత్సరాల చరిత్ర కలిగిన బిఎఎస్ ఎఫ్ ప్రపంచవ్యాప్తంగా 200కి పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోందని అన్నారు. 234 కర్మాగారాలు, 1,08,000 మంది ఉద్యోగులతో పనిచేస్తున్న ఈ సంస్థ వార్షిక ఆదాయం దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు (60 బిలియన్ డాలర్లు) అని, ప్రపంచంలోని పలు నగరాలతో పోటీ పడి హైదరాబాద్ ఈ ప్రతిష్ఠాత్మక అవకాశాన్ని దక్కించుకోవడం రాష్ట్రానికి దక్కిన గౌరవం అని పేర్కొన్నారు. ఎన్విడియా, మైక్రోసాఫ్ట్, గూగుల్, వాన్‌గార్డ్, ఎలీ లిల్లీ, మారియట్ ఇంటర్నేషనల్ లాంటి దిగ్గజ సంస్థలు ఇక్కడ జిసిసిలు ఏర్పాటు చేసి హైదరాబాద్ నగరానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయని శ్రీధర్ బాబు తెలిపారు. కార్యక్రమంలో బిఎఎస్‌ఎఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అలెగ్జాండర్ గెర్డింగ్, గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ అధ్యక్షుడు టోబియాస్ డ్రాట్ , రాష్ట్ర ప్రభుత్వ ఐటి సలహాదారు సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.