
మన తెలంగాణ/ హన్మకొండ: వరంగల్‌లో నేడు నిర్వహిస్తున్న బీఆర్‌ఎస్ రైతు సంగ్రామ సభకు కెటిఆర్ వస్తున్నందున ఆ పార్టీ భారీ ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి వరంగల్ కేంద్రంలో ఏర్పాటుచేసిన ఈ రైతు నిరసన సభకు వరంగల్ ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ నుంచి రైతులు భారీ సంఖ్య లో రానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని రైతుల కోసం నేరుగా కెటిఆర్ వరంగల్ నుంచి పోరు బాటను ప్రారంభిస్తున్నారు. ఇందుకోసం సభలో వచ్చిన రైతులకు ఎలాంటి అసౌకర్యం ఏర్పడకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. హన్మకొండ, వరంగల్ జిల్లా సరిహద్దులోని ఖమ్మం బ్రిడ్జి సమీపంలో ఈ సభను నిర్వహిస్తున్నారు. మంగళవారం సాయంత్రం వర కు సభ ఏర్పాట్లు వాసుదేవరెడ్డి పూర్తిచేశారు. కెటిఆర్ ఇప్ప టికే వరంగల్ చేరుకున్నారు. ఈ సభపై పార్టీకి భారీ అంచనాలున్నాయి.