← Back to headlines

కార్యకర్తల శ్రమను కాంగ్రెస్ వమ్ము చేసింది: డిఎంకె

2026-05-07 14:57 • original

చెన్నై: తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన టివికెకి మద్దతు ఇచ్చేందుకు ముందుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు కాంగ్రెస్ అధికార డిఎంకె పార్టీతో కలిసి పోటీ చేసింది. ఇప్పుడు ఫలితాల తర్వాత కాంగ్రెస్ టివికెకు మద్దతు ఇస్తామని తెలపడంపై డిఎంకె ఆగ్రహం వ్యక్తం చేసింది. డిఎంకె శాసనాసభాపక్ష సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ వైఖరిని ఖండిస్తూ తీర్మానం చేశారు. కాంగ్రెస్ పాత రాజకీయ స్వభావాన్ని మార్చుకోవాలేదని డిఎంకె పేర్కొంది. ‘‘లౌకిక, అభ్యదయ కూటమి నుంచి వైదొలగాన్న నిర్ణయం సరికాదు. కూటమి వల్లే కాంగ్రెస్‌కు రాజ్యసభ ఎంపి, అసెంబ్లీ సీట్లు వచ్చాయి. కార్యకర్తల శ్రమను కాంగ్రెస్ వమ్ము చేసింది’’ అని డిఎంకె విమర్శించింది.