
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 19 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోరును సాధించింది. వర్షం వల్ల మ్యాచ్‌ను ఒక ఓవర్ కుదించారు. డక్‌వర్త్ లూయిస్ నిబంధన ప్రకారం బెంగళూరు లక్ష్యాన్ని 19 ఓవర్లలో 213 పరుగులుగా నిర్దేశించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు తాజా సమాచారం లభించే సమయానికి 2 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 17 పరుగులు చేసింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన లక్నోను ఓపెనర్ మిఛెల్ మార్ష్ అద్భుత శతకంతో ఆదుకున్నాడు. చెలరేగి ఆడిన మార్ష్ 56 బంతుల్లోనే 111 పరుగులు చేశాడు.