← Back to headlines

రాజీనామాకు మమతా నో.. గవర్నర్ కీలక నిర్ణయం

2026-05-07 14:16 • original

కోల్‌కతా: ఇటీవల జరిగిన పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి జయకేతనం ఎగరవేసిన విషయం తెలిసిందే. మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ‌ని భారీ తేడాతో బిజెపి ఓడించింది. అయితే ఈ ఓటమి తర్వాత సిఎం పదవికి రాజీనామా చేసేది లేదని మమతా బెనర్జీ తేల్చి చెప్పేశారు. దీంతో ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి కీలక నిర్ణయం తీసుకున్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని గవర్నర్ రద్దు చేశారు. ఈ నెల 9న పశ్చిమ బెంగాల్‌లో బిజెపి ప్రభుత్వం కొలువుదీరనుంది. శుక్రవారం (మే 8న) బిజెపి శాసనసభా పక్ష సమావేశం జరుగనుంది.