
మైక్రో ఫైనాన్స్ విషయంలో తన ప్రమేయం లేకున్నా తన పేరును ప్రచారం చేస్తున్నారని, తన పై అసత్య ప్రచారం చేస్తున్నారని సింగర్ మంగ్లీ హైదరాబాద్ సిటీ కోర్టులో పిటీషన్ వేవారు. మైక్రో ఫైనాన్స్ విషయంలో తనపై ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. తన పరువు నష్టం కలిగించే విధంగా ప్రసారం చేసిన వీడియోలను తొలగించాలని పిటిషన్ వేశారు. రమావత్ మధు, అడ్వకేట్ సుబ్బారావు, హేమాకాంత్ రెడ్డితో పాటు పలు మీడియా సంస్థలు, డిజిటల్ మీడియా సంస్థలకు నోటీసులు జారీ చేశారు.
తన పరువుకు నష్టం కలిగించే విధంగా వార్తలు ప్రసారం చేశారని పేర్కొన్నారు. కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీశారని తెలిపారు. సోషల్ మీడియాలో ఆయా లింకులను వెంటనే తొలగించాలని, భవిష్యత్తులో తనపై అసత్య ప్రచారం చేయకుండా నిరోధించాలని మంగ్లీ కోర్టును కోరింది. మంగ్లీ పిటీషన్ ఆధారంగా మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానల్స్, రామావత్ మధు,సుబ్బారావు, హేమాకాంత్ రెడ్డి లకు సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేసింది.