
దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా కెటిఆర్ మాటలున్నాయని, వరంగల్ రైతు డిక్లరేషన్‌ను తమ ప్రభుత్వం అమలు చేస్తోందని పరిగి, ఎమ్మెల్యే, టి. రాంమ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ చెప్పినట్లు రెండు లక్షల రైతు రుణమాఫీ చేశామని, గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాల్లో గతం కంటే రెట్టింపు స్థాయిలో రుణమాఫీ చేశామని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని రుణమాఫీపైన అసెంబ్లీ తాను సవాల్ విసిరితే స్పందించలేదని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఎన్నికల్లో బిఆర్‌ఎస్ చిత్తుగా ఓడిపోయిందని, దొంగే దొంగా అని అరిచినట్లుగా కెటిఆర్ తీరు ఉందని ఆయన తెలిపారు. కెసిఆర్ కుటుంబం రూ.8 లక్షల కోట్ల అప్పును తెలంగాణ నెత్తిన పెట్టిపోయిందని,
ఇచ్చిన హామీలను అమలు కోసం తమ సిఎం రేవంత్ రెడ్డి అహర్నిశలు కట్టపడారని ఆయన తెలిపారు. కెటిఆర్ రెన్యువల్ సిఎం కాదనీ ఆయన అన్నారు. ఇప్పటికే నాలుగు సార్లు రైతు భరోసా ఇచ్చామని, కెసిఆర్ చేసిన అప్పుల వల్లనే రైతు భరోసా కొంత ఆలస్యం అవుతోందని ఆయన తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని, వరి వస్తే ఉరే అని కెసిఆర్ చెప్పారని, కానీ తమ ప్రభుత్వం సన్న వడ్లు వేసిన రైతులకు రూ.500 ల బోనస్ ఇస్తుందని ఆయన తెలిపారు. తమ ముఖ్యమంత్రిని అవమానించేలా మాట్లాడితే తమ కాంగ్రెస్ కార్యకర్తలు తగిన శాస్తై చేస్తారని ఆయన పేర్కొన్నారు.