
లక్నో: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఏకానా స్టేడియం వేదికగా.. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ సీజన్‌లో 9 మ్యాచులు ఆడి కేవలం 2 మ్యాచులు మాత్రమే గెలిచి టేబుల్‌లో చివరి స్థానంలో ఉంది లక్నో. దీంతో ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు నిలుపుకోవాలని ఆ జట్టు భావిస్తోంది. మరోవైపు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న ఆర్‌సిబి ఈ మ్యాచ్‌లో గెలిస్తే మొదటి స్థానానికి వెళ్లే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సిబి జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. లక్నో జట్టులో నుంచి జోస్ ఇంగ్లిస్, మోసిన్ ఖాన్, ఆవేశ్ ఖాన్‌లను తొలగించి.. అర్షిన్ కులకర్ణి, షాహబాజ్‌లను జట్టులోకి తీసుకున్నారు.
తుది జట్లు:
ఎల్‌ఎస్‌జి: మిచెల్ మార్ష్, అర్షిన్ కులకర్ణి, నికోలస్ పూరన్, ఐడెన్ మార్క్‌రమ్, రిషబ్ పంత్(కీపర్/కెప్టెన్), అక్షత్ రఘువంశీ, హిమ్మత్ సింగ్, షహబాజ్ అహ్మద్, దిగ్వేష్ సింగ్ రాఠి, మహ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్.
ఆర్‌సిబి: జాకబ్ బేతల్, విరాట్ కోహ్లీ, దేవ్‌దత్ పడిక్కల్, రజత్ పాటిదర్(కెప్టెన్), జితేశ్ శర్మ(కీపర్), కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, రసిక్ సలామ్ దర్, జోష్ హేజిల్‌వుడ్.