
టీం ఇండియా టి-20 కెప్టెన్, ముంబై ఇండియన్స్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్‌కు తండ్రిగా ప్రమోషన్ వచ్చింది. ఆయన భార్య దేవిషా శెట్టి గురువారం పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో ఐపిఎల్‌లో మే 10న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగే మ్యాచ్‌లో సూర్యకుమార్ పాల్గొనడం లేదని తెలుస్తోంది. సూర్యకుమార్-దేవిషా శెట్టిల వివాహం జూలై 7, 2016లో జరిగింది. 2010లో ఓ కాలేజీ వేడుకలో వీరికి పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. అనంతరం ఇద్దరి కుటుంబసభ్యులను ఒప్పించి వివాహం చేసుకున్నారు. ఇక సూర్య విషయానికొస్తే.. ఈ ఏడాది జరిగిన టి-20 ప్రపంచకప్‌లో సూర్య సారథ్యంలో భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఐపిఎల్‌లో 10 మ్యాచులు ఆడిన అతడు 195 పరుగులు చేశాడు.