← Back to headlines

అలరిస్తున్న పవర్‌ఫుల్ గ్లింప్

2026-05-08 03:55 • original

విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నేతృత్వంలోని ప్రముఖ బ్యానర్ 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ మరో క్రేజీ ప్రాజెక్ట్ తో రాబోతుంది. సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తుండగా, రచయిత నుంచి దర్శకుడిగా మారిన కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ పుట్టినరోజు సందర్భంగా, పవర్‌పేట చిత్ర నిర్మాతలు ఆకట్టుకునే గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ గ్లింప్స్ థియేటర్‌లో ఫస్ట్ డే ఫస్ట్ షో హంగామాతో హై వోల్టేజ్ మూడ్‌లో ప్రారంభమై ఆద్యంతం అలరించింది. సందీప్ కిషన్ ఈ సినిమాలో రగ్డ్ పీరియాడిక్ అవతార్‌లో కనిపించారు. దర్శకుడు కృష్ణ చైతన్య భారీ స్థాయి మాస్ క్యారెక్టరైజేషన్‌ను ఎంత బలంగా డిజైన్ చేశారో ఈ గ్లింప్స్‌లో స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ విజయవంతంగా పూర్తయింది.