← Back to headlines

విమానంలో వేపింగ్.. చిక్కుల్లో యుజవేంద్ర చాహల్

2026-05-07 12:49 • original

ఐపిఎల్ 19వ సీజన్‌లో మరోసరి వేపింగ్ వెలుగులోకి వచ్చింది. పంజాబ్ కింగ్స్ బౌలర్ యుజవేంద్ర చాహల్ విమానంలో వేపింగ్ చేస్తూ కెమెరా కంటికి చిక్కాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. అహ్మదాబాద్ నుంచి హఐదరాబాకు వస్తుండగా ఈ ఘటన జరిగి ఉండొచ్చని భావిస్తున్నరు.

పంజాబ్ కింగ్స్ జట్టు విమానంలో ప్రయాణిస్తుండగా.. ఆ జట్టు పేసర్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ ఓ వ్లాగ్ చేశాడు. కిటికీ పక్క సీటులో కూర్చున్న చాహల్.. పక్కన ఉన్న శశాంక్ సింగ్‌తో మాట్లాతుండగా తన చేయి అడ్డుపెట్టుకుని ఏదో నోటి దగ్గర పెట్టుకున్నట్లు ఆ వీడియోలో కనిపించింది. చాహల్ వేపింగ్ చేశాడని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. అర్ష్‌దీప్ తొలుత ఈ వీడియోను అప్‌లోడ్ చేసినప్పుడు దాని నిడివి 16: 56 నిమిషాలు ఉందని నెట్టింట చర్చ జరుగుతోంది. చాహల్‌ వేపింగ్ చేసిన క్లిపింగ్‌లు వైరల్‌ కావడంతో ఆ దృశ్యాలను తొలగించి 16 నిమిషాల వీడియోను మళ్లీ అప్‌లోడ్ చేశారని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.