← Back to headlines

పంజాబ్ మాజీ క్రికెటర్ కన్నుమూత.. కోహ్లీ, యువరాజ్ సంతాపం

2026-05-07 11:39 • original

పంజాబ్ మాజీ క్రికెటర్, విరాట్ కోహ్లీతో కలిసి అండర్-19 ప్రపంచకప్‌లో పాల్గొన్న అమన్‌ప్రీత్ సింగ్ గిల్.. బుధవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. అమన్‌ప్రీత్ మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే అతడి అకాల మరణానికి విరాట్‌తో పాటు పలువురు మాజీ క్రికెటర్లు సంతాపం తెలియజేస్తూ.. సోషల్‌మీడియాలో పోస్ట్‌లు పెట్టారు.

‘‘అమన్‌ప్రీత్ అకాల మరణం షాక్‌కు గురి చేసింది. అత్యంత బాధాకరం. అతడి కుటుంబసభ్యులకు మనోధైర్యం కలగాలని ప్రార్థిస్తున్నా. రెస్ట్‌ ఇన్‌ పీస్. ఓం శాంతి’’ అని విరాట్ పోస్ట్ చేశాడు. ‘‘అమన్‌ప్రీత్ మృతి విషయం తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యా. మేం క్రికెట్ ఆడే తొలి రోజుల్లో అతడితో కలిసి డ్రెస్సింగ్‌ రూమ్‌ పంచుకున్నా. ఆటను ఎంతో ప్రేమించే వ్యక్తి. కష్టపడే వ్యక్తి. అతడి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ అని యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు.

అమన్‌ప్రీత్ 2007లో అండర్-19 ప్రపంచకప్‌లో అమన్‌ప్రీత్ విరాట్‌తో కలిసి పాల్గొన్నాడు. ఆ టోర్నీలో ఐదు మ్యాచ్‌లు ఆడిన ఆయన మొత్తంగా 9 వికెట్లు తీసి తన సత్తా చాటాడు. ఇక దేశవాళీ క్రికెట్‌లో అమన్‌ప్రీత్ పంజాబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించగా.. విరాట్ ఢిల్లీకి ఆడాడు. ఆమన్‌ప్రీత్ ఆరు ఫస్ట్‌ క్లాస్ మ్యాచుల్లో 11 వికెట్లు తీశాడు.