← Back to headlines

షేక్ ఆడిస్తున్న అభిషేక్.. దిగ్గజ క్రికెటర్ రికార్డు బద్దలు

2026-05-07 11:03 • original

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ.. ఈ ఐపిఎల్ సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఆరంభంలో కాస్త తడబడిన ఆ తర్వాత పుంజుకొని లీడింగ్ స్కోరర్ల జాబితాలో ప్రస్తుతం రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో అభిషేక్ ఓ అరుదైన రికార్డును బద్దలు కొట్టాడు. బుధవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 13 బంతుల్లో 4 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 35 పరుగులు చేసి బీభత్సం సృష్టించాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ క్రిస్ గేల్ పేరిట ఉన్న రికార్డును తను సొంతం చేసుకున్నాడు.

ఓపెనర్‌గా ఐపిఎల్‌లో 200కు పైగా స్ట్రైక్‌రేటుతో అత్యధిక సార్లు 30+ స్కోర్ నమోదు చేసిన బ్యాటర్‌గా అభిషేక్ రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకూ అతడు 14 సార్లు ఈ ఫీట్‌ను అందుకున్నాడు. ఈ క్రమంలో క్రిస్ గేల్ (13 సార్లు)ను అధిగమించాడు. ఇలాగే రాణిస్తూ.. అభిషేక్ మరిన్ని రికార్డులు సొంతం చేసుకోవాలని అతడి అభిమానులు కోరుకుంటున్నారు.