
హైదరాబాద్: డ్రగ్స్ నియంత్రణను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత అంశంగా తీసుకున్నదని డిజిపి సివి ఆనంద్ తెలిపారు. డ్రగ్స్ మహమ్మారి వల్ల ఎన్నో కుటుంబాలు బాధపడుతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా సివి ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ.. డ్రగ్స్ నివారణకు ఈగల్ ఫోర్స్ చాలా కృషి చేస్తోందని, మన ఈగల్ ఫోర్స్ ఇతర రాష్ట్రాలు, దేశాల్లో కూడా ఆపరేషన్స్ నిర్వహించిందని తెలియజేశారు. డ్రగ్స్ సరఫరాకు చెందిన ఎన్నో లింకులను ఈగలు ఫోర్స్ ఛేదించిందని, సిబ్బంది కొరత ఉన్నప్పటికీ నార్కోటిక్ విభాగం మంచి పనితీరు కనబరిచిందని సివి ఆనంద్ పేర్కొన్నారు. డ్రగ్స్ కట్టడిలో జిల్లాల పోలీసు యంత్రాంగం కూడా దృష్టి సారించాలని, డ్రగ్స్ నివారణలో కాలేజీ యాజమాన్యాల బాధ్యత కూడా పెరగాలని డిజిపి సివి ఆనంద్ సూచించారు.