
బలగం వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత వేణు యెల్దండి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఎల్లమ్మ’. ఈ సినిమా ప్రకటించి చాలాకాలమే అయినా.. సెట్స్‌పైకి వెళ్లడం మాత్రం జరగలేదు. ఎందుకంటే సినిమా హీరో విషయంలో చాలా తికమకలు జరిగాయి. తొలుత నేచురల్ స్టార్ నానిని ఈ సినిమాలో హీరోగా అనుకున్నారు. అయితే నాని ఫుల్ బిజీగా ఉండటంతో ఆ తర్వాత నితిన్‌తో సంప్రదింపులు జరిపారు కానీ, నితిన్ కూడా సెట్ కాలేదు. చివరికి ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ను హీరోగా ఫరిచయం చేస్తున్నారు.
అయిత ఇక్కడ మరో చిక్కొచిపడింది. ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరిని ఎంపిక చేయాలా.. అని చిత్ర యూనిట్ వెతుకులాట ప్రారంభించింది. తొలుత సాయిపల్లవి, కీర్తి సురేశ్‌ల పేర్లు వినిపించాయి. కానీ, వాళ్లు ఈ సినిమా చేయడానికి ఒప్పుకోలేనదని టాక్. తాజాగా ఇప్పుడు మరో పేరు వినిపిస్తుంది అవిడే మృణాల్ ఠాకూర్. సినిమా టైటిల్ ‘ఎల్లమ్మ’కు తగినట్లే సినిమాలో హీరోయిన్ పాత్ర కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని తెలుస్తోంది. దీంతో మృణాల్‌కు ఈ సినిమా అవకాశం రావడంతో తన నటనని నిరూపించుకొనే అవకాశం దొరికే ఛాన్స్ ఉంది. దీంతో ఆమె కూడా దాదాపు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.