
పాట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నిశాంత్ తోపాటు భారతీయ జనతా పార్టీ (బిజెపి), జనతా దళ్ యునైటెడ్ (జెడియు), కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్), కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హిందుస్తానీ ఆవామ్ మోర్చా (సెక్యులర్)కు చెందిన మరో 31 మంది నాయకులకు బీహార్ మంత్రివర్గంలో చోటు లభించింది. గురువారం పాట్నాలో గవర్నర్, వీరి చేత మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, ఇతర నాయకులు
కాగా, బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన నితీష్ కుమార్ .. రాజ్యసభ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బిహార్ లో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది.