
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో ఘన విజయం సాధించింది. బుధవారం పంజాబ్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 33 పరుగుల తేడాతో నెగ్గి.. పాయింట్ల టేబుల్‌లో అగ్రస్థానానికి వెళ్లింది. ఈ విజయాన్ని జట్టు వికెట్ కీపర్, బ్యాటర్ ఇషాన్ కిషన్ తనదైన శైలీలో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో బుధవారం నాటి మ్యాచ్ ఫోటోలను పోస్ట్ చేసిన కిషన్ ‘సాధ్యమైతే నన్ను పట్టుకోండి’ అని రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ పిబికెఎస్‌తో పాటు ఇతర జట్లను ట్రోల్ చేసే విధంగా ఉందని అభిమానులు అనుకుంటున్నారు.
ఇక నిన్నటి మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసింది. ఎస్ఆర్‌హెచ్ బ్యాటింగ్‌లో క్లాసెన్ 69, కిషన్ 55, హెడ్ 38, అభిషేక్ 35, నితీశ్ 29 (నాటౌట్) పరుగులు చేశారు. అయితే లక్ష్య చేధనలో పిబికెఎస్ విఫలమైంది. కానలీ(107) సెంచరీతో రాణించినా.. ఇతర బ్యాటర్ల నుంచి అతడికి సరైన సహకారం అందలేదు. దీంతో 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 202 పరుగులు మాత్రమే చేయడంతో ఎస్ఆర్‌హెచ్ ఈ మ్యాచ్‌లో 33 పరుగుల తేడాతో విజయం సాధించింది.