
ఎఐ+ స్మార్ట్‌ఫోన్ తన సరికొత్త నోవాఫ్లిప్ 5జీని 29,999 రూపాయలకే విడుదల చేసింది. తక్కువ ధరలో ఫ్లిప్ ఫోన్లను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చామని సంస్థ సిఇఒ మాధవ్ శేత్ తెలిపారు. దీనిలో 6.78 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 3.0 అంగుళాల కవర్ స్క్రీన్ ఉన్నాయి. 50ఎంపి వెనుక కెమెరా, 32ఎంపి సెల్ఫీ కెమెరాతో పాటు డైమెన్సిటీ 7300ఎక్స్ చిప్‌సెట్ వాడారు. 4325 ఎంఎహెచ్ బ్యాటరీ కలిగిన ఈ ఫోన్ విక్రయాలు మే 8 నుండి ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమవుతాయి.