← Back to headlines

కరీంనగర్ నగల చోరీ కేసు దర్యాప్తులో పోలీసులు విఫలం: కౌశిక్ రెడ్డి

2026-05-07 06:56 • original

హైదరాబాద్: కరీంనగర్ సిపి గౌస్ ఆలం చేతగాని తనంతో లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందని బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. అల్గునూరులో ఓ లాయర్ ను యూపీ ముఠా బెదిరించిందని అన్నారు. కరీంనగర్ సిపిపై కౌశిక్ రెడ్డి విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.  ఆయుధాలతో లాయర్ ను చంపే ప్రయత్నం చేశారని, లాయర్ పై హత్యాయత్నం జరిగితే సిపి ఏం చేస్తున్నారు అని ఐదు రోజులైనా దొంగలను పట్టుకోరా? అని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. కరీంనగర్ నగల చోరీ కేసు దర్యాప్తులో పోలీసులు విఫలం అని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గన్ కల్చర్ వ్యాపిస్తోందని విమర్శించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, తనపై దుండగులు రెక్కీ నిర్వహిస్తున్నారని, జిల్లాలో శాంతిభద్రతలపై కేంద్ర, రాష్ట్ర మంత్రులు సమీక్ష నిర్వహించాలని సూచించారు. కరీంనగర్ సిపి గౌస్ ఆలంను సస్సెండ్ చేయాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.