← Back to headlines

విజయ్ కు గవర్నర్ మళ్లీ షాక్.. మెజార్టీతో వస్తేనే అనుమతి..

2026-05-07 06:45 • original

తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై గందరగోళం నెలకొంది. ప్రభుత్వ ఏర్పాటు అవకాశం ఇవ్వాలని కోరిన టివికె అధినేత విజయ్ కు గవర్నర్ మరోసారి షాకిచ్చారు. మెజారిటీ సంఖ్యాబలం ఉన్నప్పుడు మాత్రమే విజయ్‌ను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అనుమతిస్తామని గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం కావాలని, అందుకు అవసరమైన సంఖ్యాబలం రుజువయ్యే వరకు వేచి చూస్తానని ఆర్లేకర్ చెప్పినట్లు లోక్ భవన్ వర్గాలు తెలిపాయి.

రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నంలో భాగంగా విజయ్ గురువారం గవర్నర్‌ను రెండోసారి కలిశారు. ఈ సమావేశంలో, అసెంబ్లీలో ఏకైక అతిపెద్ద పార్టీ నాయకుడిగా తనను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అనుమతించాలని విజయ్ కోరారు. సభలో తమ పార్టీ మెజారిటీని నిరూపించుకుంటుందని కూడా విజయ్ గవర్నర్ కు తెలిపారు. అయితే, విజయ్ వివరణతో సంతృప్తి చెందని గవర్నర్.. పూర్తి మెజార్టీతో వస్తేనే.. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతిస్తామని తేల్చి చెప్పినట్లు సమాచారం.