← Back to headlines

టివికె ప్రభుత్వం ఏర్పడితే.. 6 నెలల వరకు ఇబ్బంది పెట్టం: స్టాలిన్

2026-05-07 06:17 • original

చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే) స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించినా.. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ లేకపోవడంతో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో మాజీ సిఎం, ద్రవిడ మున్నేట్ర కజగం(డిఎంకె) అధినేత ఎంకే స్టాలిన్ స్పందిస్తూ.. రాష్ట్రంలో అధికార బదిలీ సజావుగా జరుగుతుందని హామీ ఇచ్చారు. తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే ఆరు నెలల పాటు డిఎంకె కొత్త ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టదని అన్నారు. అయితే, తమ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను టివికె కొనసాగిస్తుందని తాను ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.

పాఠశాల విద్యార్థులకు ఉచిత అల్పాహార పథకం, మహిళాలకు నెలవారీ ఆర్థికసాయం వంటి కార్యక్రమాలను కొనసాగించాలని ఆయన అన్నారు. అంతేకాకుండా, ఎన్నికలకు ముందు మహిళలకు వాగ్దానం చేసిన నెలకు రూ.2,500 ఆర్థిక సాయాన్ని కూడా టివికె నెరవేర్చాలని పేర్కొన్నారు.