← Back to headlines

ఐపిఎల్ లో నయా రికార్డు.. డికాక్, వార్నర్ రికార్డు బద్దలు

2026-05-07 05:43 • original

న్యూఢిల్లీ: ఐపిఎల్ లో పంజాబ్ కింగ్స్ యువ బ్యాటర్ కానలీ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఐపిఎల్ చరిత్రలో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన విదేశీ బ్యాటర్‌గా కానలీ నిలిచాడు. ఈక్రమంలో క్వింటన్ డి కాక్, డేవిడ్ వార్నర్‌ల రికార్డును బ్రేక్ చేశాడు. ఐపిఎల్ 2026లో భాగంగా బుధవారం(మే 6) జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో కానలీ అద్భుత శతకంతో చెలరేడాడు.

తొటి బ్యాటర్స్ పరుగులు చేయలేక పెవిలియన్ కు క్యూ కడుతుండగా.. కానలీ మాత్రం సన్ రైజర్స్ బౌలర్లపై ఎదరుదాడి చేస్తూ.. భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఈక్రమంలో కేవలం 59 బంతుల్లో107 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. దీంతో కేవలం 22 సంవత్సరాల 257 రోజుల వయస్సులోనే కానలీ సెంచరీ చేసి.. డి కాక్, వార్నర్ రికార్డులను బద్దలు కొట్టాడు. డి కాక్, 23 ఏళ్ల 122 రోజులు, డేవిడ్ వార్నర్ 23 ఏళ్ల 153 రోజులు, డేవిడ్ మిల్లర్ 23 ఏళ్ల 330 రోజులు, కామెరాన్ గ్రీన్ 23 ఏళ్ల 352 రోజుల వయస్సులో ఈ ఘనత సాధించారు. 

ఇక, మ్యాచ్ విషయానికి వస్తే.. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన కీలక పోరులో పంజాబ్ పై 33 పరుగుల తేడాతో హైదరాబాద్ గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ(35), ట్రావిస్ హెడ్(38), క్లాసెన్(69), ఇషాన్ కిషన్(55), నితీష్ కుమార్ రెడ్డి(29 నాటౌట్)లు రాణించారు.

అనంతరం 236 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 202 పరుగులు మాత్రమే చేయగలిగింది. కానలీ ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తూ శతకంతో చెలరేగినా ఫలితం దక్కలేదు.