← Back to headlines

సీతాఫల్‌మండిలో ఇంజినీరింగ్ స్టూడెంట్‌ను కత్తులతో పొడిచి హత్య

2026-05-08 04:05 • original

హైదరాబాద్: అమ్మాయిని ప్రేమిస్తున్నాడని ఇంజినీరింగ్ స్టూడెంట్‌ను ఆమె కుటుంబ సభ్యులు కత్తులతో పొడిచి చంపిన సంఘటన హైదరాబాద్‌లోని సీతాఫల్‌మండిలో జరిగింది. స్థానికులు తెలిపిన ప్రాథమిక వివరాల ప్రకారం.... యువాన్ (25) అనే యువకుడు కాలేజీలో బిటెక్ చదువుతూ అల్వాల్‌లో ఉంటున్నాడు. సీతాఫల్‌మండికి చెందిన ఓ యువతితో యువాన్ ప్రేమలో పడ్డాడు. ఈ విషయం ఆమె కుటుంబ సభ్యులకు తెలియడంతో పలుమార్లు యువాన్ బెదిరించారు. యువాన్ వాళ్ల బెదిరింపులకు లొంగకపోవడంతో సదరు యువతితో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు. సీతాఫల్‌మండిలోని ఇందిరానగర్‌లో తన స్నేహితులతో కలిసి అరుగు మీద కూర్చొని ఫోన్‌లో క్రికెట్ చూస్తున్నాడు. అదే సమయంలో యువతి బావ, సోదరుడు కత్తులు తీసుకొని యువాన్‌పై దాడి చేశారు. అతడు కిందపడిపోవడంతో గొంతు కోసి అక్కడి నుంచి నిందితులు పారిపోయారు. వెంటనే స్థానికుల స్పందించి యువాన్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు.