← Back to headlines

సికింద్రాబాద్ బీటెక్ స్టూడెంట్ దారుణం హత్య

2026-05-08 04:22 • original

నవతెలంగాణ – హైదరాబాద్ : చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంజినీరింగ్​స్టూడెంట్​యవన్ ను నిన్న రాత్రి అందరూ చూస్తుండగా కత్తులతో పొడిచి దారుణంగా చంపేశారు. అల్వాల్ ప్రాంతానికి చెందిన యవాన్ (25) ఓ ప్రయివేటు కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. సీతాఫల్​మండికి చెందిన ఓ యువతితో నాలుగేండ్లుగా ప్రేమలో ఉన్నాడు. సీతాఫల్​మండి ఇందిరానగర్​లో యవాన్​కు ఫ్రెండ్స్​ఉండడంతో వారిని కలిసేందుకు తరచూ వస్తుండేవాడు. తను ప్రేమించిన యువతిని కూడా కలుస్తూ ఉండేవాడు. ఈ ప్రేమ వ్యవహారం గురించి తెలుసుకున్న అమ్మాయి బంధువులు యావన్ కు పలుమార్లు వార్నింగ్ ఇచ్చారు. 

గురువారం యావన్ ఇందిరానగర్ లోని ఫ్రెండ్స్​తో కలిసి అరుగుపై కూర్చుని క్రికెట్​చూస్తున్నాడు. విషయం తెలుసుకున్న అమ్మాయి బావ, సోదరుడు మరో ముగ్గురితో కలిసి కత్తులతో ఇందిరానగర్ వచ్చారు. క్రికెట్​చూస్తున్న యావన్​ను గొంతుతోపాటు పలుచోట్ల విచక్షణారహితంగా పొడిచారు. మొత్తం 17 చోట్ల పొడవడంతో తీవ్ర గాయాలై రక్తపు మడుగులో పడిపోయాడు. గమనించిన స్థానికులు గాంధీ దవాఖానకు తరలించగా, మార్గమధ్యలో ప్రాణాలు విడిచాడు.

చిలకలగూడలో ఉద్రిక్తత
యువకుడిని చంపడంతో బాధిత కుటుంబ సభ్యులు నిందితుల ఇంటిని ముట్టడించారు కుటుంబ సభ్యులు. ఉదయం మృతుడి బంధువులు, కుటుంబ సభ్యులు భారీగా తరలి వచ్చిన ఇంటి వైపు దూసుకొచ్చారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.   దీంతో కాసేపు అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు అడ్డుకోవడంతో బాధితులు ఇంటిముందు భైఠాయించి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు అక్కడ భారీగా మోహరించారు.

The post సికింద్రాబాద్ బీటెక్ స్టూడెంట్ దారుణం హత్య appeared first on Navatelangana.