← Back to headlines

బిఆర్‌ఎస్‌కు కోర్టు మొట్టికాయలు

2026-05-06 23:30 • original

మన తెలంగాణ/హైదరాబాద్ : అంగన్వాడీ మొబైల్ ఫోన్ కొనుగోళ్ల మీద బిఆర్‌ఎస్ చేసింది తప్పుడు ప్రచారంగా నిర్దారిస్తూ తక్షణమే బిఆర్‌ఎస్ అకౌంట్ల నుంచి పోస్టులను తొలగించాలని సిటి సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బిఆర్‌ఎస్, అధినేత కెసిఆర్ మీద మంత్రి సీతక్క వేసిన పరు వు నష్టం దావా కేసులో సిటీ సివిల్ కోర్ట్ ఈ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. రూ.30 కోట్లు అవినీతి అనే బిఆర్‌ఎస్ ఆరోపణలలో ఎలాంటి వాస్తవం లేదని తేల్చిచెప్పింది. టెండర్ నోటిఫికేషన్ నుండి చెక్ పేమెంట్ వరకు వివరాలను కోర్టు పరిశీలిం చింది. మొబైల్ ఫోన్లు ఒకటి రూ. 11,650/- -తో మొత్తం రూ 44,42,14, 500 కొనుగోలు చేయగా,

రూ 8499 విలువైన ఫోన్ రూ 14,499 కొన్నారు అని బిఆర్‌ఎస్ తప్పుడు ఆరోపణలు చేసిన ట్లుగా కోర్టు నిర్ధారించింది. సదరు ఆరోపణలు పిటిషినర్ సీతక్క ప్రతిష్ఠను దెబ్బతీయ డానికే అన్న వాదనతో కోర్టు ఏకీభవించింది. తప్పుడు ఆరోపణ లతో కూడిని సోషల్ మీడియా పోస్టులను తక్షణం తొలగించాలని బిఆర్‌ఎస్, కెసిఆర్‌ను కోర్టు ఆదేశించింది. ఫేస్ బుక్, ట్విట్లర్, ఇన్స్టాగ్రామ్‌ల నుం డి ఏప్రిల్ 10 న చేసిన పోస్టులు తొలగించాలని ఆదేశించింది. మంత్రి సీతక్క తరపున అడ్వకేట్ నాగులూరి కృష్ణకుమార్ వాదనలు వినిపించారు. ఈ కేసులో తదుపరి విచారణను జూన్ 7కి వాయిదా వేసింది.