← Back to headlines

సిబిఎఫ్‌సి ఛైర్‌పర్సన్‌గా శశిశేఖర్ వెంపటి నియామకం

2026-05-06 17:35 • original

న్యూఢిల్లీ : ప్రసారభారతి మాజీ సిఇఒ శశిశేఖర్ వెంపటిని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (సిబిఎఫ్‌సి)ఛైర్‌పర్సన్‌గా ప్రభుత్వం నియమించింది. సిబిఎఫ్‌సి ఛైర్‌పర్సన్‌గా ఇంతవరకు పనిచేసిన ప్రసూన్ జోషి స్థానంలో శశిశేఖర్ నియామకమయ్యారు. ప్రఖ్యాత గీత రచయిత జోషి ఎనిమిదేళ్లు సిబిఎఫ్‌సి ఛైర్మన్‌గా పనిచేశారు.

ఐఐటి బొంబైలో చదువుకున్న వెంపటి రచయిత, ఎ14 ఇండియా ఒఆర్‌జి సహ సంస్థాపకులు, ఎ14 ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి అనుసంధానంగా పనిచేస్తుంది. సిబిఎఫ్‌సికి ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగలూరు, తిరువనంతపురం, హైదరాబాద్,న్యూఢిల్లీ,కటక్, గువాహటి ప్రాంతాల్లో తొమ్మిది ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి.