← Back to headlines

ఆ కులాలకు పేర్లు మార్పు... పర్యాయ పదాలు చేర్చాం: పొన్నం

2026-05-08 04:47 • original

హైదరాబాద్: వెనుకబడిన తరగతుల కోసం తెలంగాణ బిసి కమిషన్ సమర్పించిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో సామాజిక, విద్యా పరంగా వెనుకబడిన జాబితా లోని కొన్ని కులాలు పేర్ల మార్పు, పర్యాద పదాలు చేర్చడానికి ఇటీవల కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 

1.గ్రూప్ - ఏ లో వరుస సంఖ్య 7 లో " దొమ్మర" అనే పదాన్ని తొలగించి "గడ వంశీయ" గా మార్పు

2.గ్రూప్ - ఏ లో వరుస సంఖ్య 18లో ఉన్న "పిచ్చకుంట్ల" అనే పదాన్ని తొలగించి " వంశ రాజ్ గా మార్పు"

3 గ్రూప్ - డి లో వరుస సంఖ్య 29 లో ఉన్న "శూద్ర కులం" అనే పదాన్ని తొలగించి " తమ్మలి (బ్రాహ్మణేతర)" గా మార్పు

4. గ్రూప్ ఏ లోని వరుస సంఖ్య 4 లో ఉన్న పద్ధుకు "శివ క్షత్రియ" పర్యాయ పదం గా చేర్చారు దీంతో "బుడబుక్కల శివ క్షత్రియ" గా మారుతుంది.

5.గ్రూప్ - ఏ లోని వరుస సంఖ్య 5 లో "వన్నార్ " ను తొలగించి "ధోబీ" ని చేర్చి రజక,చాకలి, దోబీ గా నమోదు చేయాలి

6. గ్రూప్ - డి లోని వరుస సంఖ్య 5 లో " మేరు" ను పర్యాయ పదంగా చేర్చి "మేర, మేరు, చిప్పోలు" గా నమోదు చేయాలి.

7. గ్రూప్ ఏ లోని వరుస సంఖ్య 23 లొ ఉన్న "వీరభద్రియ( వీరముష్టి, నెట్టి కోటల) ను పర్యాయపదంగా చేర్చి వారి అభ్యర్థన మేరకు "వీరభద్రియ , వీరముష్టి , నెట్టి కోటల" గా నమోదు చేశారని పొన్నం వివరించారు.