← Back to headlines

మాజీ సిఎం అయిన మమత

2026-05-07 16:40 • original

బెంగాల్‌లో టిఎంసి అధినేత్రి మమత బెనర్జీ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్ర అసెంబ్లీని గవర్నర్ ఆర్‌ఎన్ రవి గురువారం రద్దు చేశారు. ఈ రోజుతో ఈ అసెఒబ్లీ గడువు తీరింది. ఇప్పుడు రద్దుతో తరువాతి అసెంబ్లీ ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. అసెంబ్లీ రద్దు సంబంధిత అధికారిక నోటిఫికేషన్ వెలువడింది. శాసనసభా వ్యవహారాల విభాగం ద్వారా గవర్నర్ సంతకంతో కూడిన అసెంబ్లీ రద్దు ఉత్తర్వులు వెలువరించారు. ఇటీవలి ఎన్నికలలో బిజెపి ఘన విజయం సాధించింది. మూడు పర్యాయాలు అధికారంలో ఉన్న మమత బెనర్జీ సారధ్య టిఎంసి పరాజయం పాలయ్యింది.