← Back to headlines

భాగ్యశ్రీ బోర్సే బర్త్‌డే.. 'లెనిన్' నుంచి పోస్టర్ రిలీజ్

2026-05-06 15:53 • original

మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్‌ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ‘లెనిన్’. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాకి మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని జూన్ 26న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఈ సినిమా నుంచి హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే బర్త్ డే సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. హ్యాపీ బర్త్ డే భాగ్యశ్రీ బోర్సే అని చెబుతూ.. రాజసం ఉట్టి పడేలా కిరీటీం, మీసం, డిఫరెంట్ వేషధారణతో భాగ్య శ్రీ ఉన్న లుక్‌ను విడుదల చేశారు. ఇందులో భాగ్య శ్రీ ఆహార్యం అందరినీ ఆకట్టుకునేలా ఉంది.

రూరల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్...

వర్సటైల్ స్టార్ శివకార్తికేయన్... దర్శకుడు శివకుమార్ మురుగేశన్ దర్శకత్వంలో కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మిస్తున్న ‘సెయాన్’ కోసం చేతులు కలిపారు. బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన అమరన్ తర్వాత శివకార్తికేయన్ మరోసారి రాజ్‌కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్‌తో కొలాబరేట్ కావడం విశేషం. గ్రాండ్ రూరల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది.