← Back to headlines

నకిలీ పోలీస్ అరెస్టు

2026-05-06 15:46 • original

 పోలీస్‌గా నమ్మిస్తూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తున్న నకిలీ పోలీసును రాజేంద్రనగర్ జోన్ టాస్క్ ఫోర్స్ అరెస్టు చేశారు. మైలార్‌దేవ్‌పల్లి, శాస్త్రీపురానికి చెందిన మహమ్మద్ అబూబకర్ అలీ తబస్సుమ్ జొమాటో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. అబూబాకర్ అలీ ఏఐతో పోలీస్‌గా వీడియోలను రూపొందించి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వాడు. వాటిని చూపిస్తూ స్థానికులను తాను పోలీస్ నని నమ్మిస్తూ పలువురిని బెదిరించేవాడు. పోలీసు అధికారిగా నటిస్తూ, ఫాలోవర్లను పెంచుకోవడానికి సోషల్ మీడియా లో, ఇన్‌స్టాగ్రాంలో, కల్పిత వీడియోలను అప్‌లోడ్ చేస్తున్నాడు. ఈ విషయం తెలియడంతో రాజేంద్రనగర్ జోన్ టాస్క్ ఫోర్స్, కాలపత్తర్, మైలార్‌దేవపల్లి పోలీసులు కలిసి నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడిపై బిఎన్‌ఎస్ 205, 66ఐటి యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.