← Back to headlines

చెలరేగిన సన్ రైజర్స్ బ్యాటర్స్.. పంజాబ్ కు భారీ టార్గెట్

2026-05-06 15:41 • original

ఐపిఎల్ 2026లో మరోసారి సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోరు సాధించింది. ఉప్పల్ స్టేడియం వేదికగా పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో హైదరాబాద్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ(35), ట్రావిస్ హెడ్(38)లు మరోసారి అదిరే ఆరంభాన్ని అందించారు. తర్వాత ఇషాన్ కిషన్(55), క్లాసెన్(69)లు అర్ధ శతకాలతో చెలరేగారు. వీరితోపాటు నితీష్ రెడ్డి(29 నాటౌట్) కూడా ధనాదన్ బ్యాటింగ్ తో అలరించాడు. దీంతో ఎస్ఆర్ హెచ్, పంజాబ్ పట్టుకు 236 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్, ఫర్గూసన్, వైషాకా, చాహాల్ లు తలో వికెట్ తీసుకున్నారు.