
ప్రముఖ కథానాయకుడు నితిన్ తదుపరి ఆసక్తికరమైన చిత్రం సాంప్రదాయ పూజా కార్యక్రమంతో అధికారికంగా ప్రారంభమైంది. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రతిభావంతులైన దర్శకులు నారి సిరిసవాడ, సోమశేఖర్ టి దర్శకత్వం వహిస్తున్నారు. రితికా నాయక్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.
ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ మే రెండో వారం నుండి ప్రారంభం కానుంది.