
న్యూఢిల్లీ : బిజెపిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి మండిపడ్డారు. ఓటు చోరీ చేస్తున్న చొరబాటుదారులుగా బిజెపిని అభివర్ణించారు. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తే ఇప్పటికిప్పుడు 140 మంది కూడా ఎంపిలుగా గెలవబోరన్నారు. ప్రస్తుతం లోక్‌సభలో ఉన్న బిజెపిలోని ప్రతి ఆరుగురు ఎంపిల్లో ఒకరు ఓటు చోరీ ద్వారా గెలిచిన వారేనని తీవ్ర ఆరోపణలు చేశారు.
ఈ మేరకు బుధవారంనాడు ఎక్స్‌లో రాహుల్ పోస్టు చేశారు. కొన్నిసార్లు ఓట్ల చోరీ ద్వారా వ్యక్తిగత సీట్లను కూడా కోల్పోవాల్సి వస్తుందని, దాన్నిగుర్తించడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. హర్యానాలో మొత్తం జరిగిందంతా చొరాబాటేనని అన్నారు. అక్కడి ప్రభుత్వం మొత్తం చొరబాటుదారులతో కూడుకున్నదేనన్నారు.