← Back to headlines

ఓటమి తర్వాత.. స్టాలిన్‌ను కలిసిన రజినీకాంత్

2026-05-06 15:03 • original

చెన్నై : ప్రముఖ నటుడు రజినీకాంత్ డిఎంకె అధినేత, మాజీ సిఎం స్టాలిన్‌ను కలిశారు. బుధవారంనాడు అళ్వార్‌పేటలోని ఆయన నివాసానికి వెళ్లి కాసేపు భేటీ అయ్యారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలలో అధికార డిఎంకె పరాజయం పాలైన తర్వాత రజినీకాంత్ వెళ్లి స్టాలిన్‌ను కలవడం చర్చనీయాంశమైంది. స్టాలిన్‌కు రజినీకాంత్ సానుభూతి తెలిపినట్లు సమాచారం.

అయితే ఇది మర్యాదపూర్వక భేటీ అని, ఇందులో విశేషమేమీ లేదని డిఎంకె వర్గాలు తెలిపాయి. భారత రాజకీయ నాయకుల్లో స్టాలిన్ అత్యుత్తముల్లో ఒకరని రజినీకాంత్ గతంలో ప్రశంసలు కురిపించారు.