← Back to headlines

టివికెతో దోస్తీ అంటే కాంగ్రెస్ పార్టీది వెన్నుపోటే: డిఎంకె ఫైర్

2026-05-06 14:59 • original

న్యూఢిల్లీ : పొత్తు ధర్మాన్ని విడనాడి తమిళనాడులో టివికెతో ఎన్నికల తర్వాత కూటమికి సిద్ధపడడం ద్వారా తమ పార్టీకి కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని డిఎంకె ఆరోపించింది. బుధవారంనాడు చెన్నైలో డిఎంకె అధికార ప్రతినిధి శరవణన్ అన్నాదురై మాట్లాడుతూ.. టివికెకు మద్దతు ప్రకటిండం తమిళులకు కాంగ్రెస్ వెన్నుపోటు పొడవడమేనని అన్నారు.అయితే డిఎంకె ఆరోపణలను కాంగ్రెస్ తోసిపుచ్చింది. తాము భావసారూప్యత కలిగిన పార్టీలతో కలిసి వెళ్లాలని నిర్ణయించామని అన్నారు.

తమిళనాడులో డిఎంకె అధికారంలో ఉండగా తాము ఎప్పుడైనా ఒక్క పదవైనా అడిగామా అని కాంగ్రెస్ మీడియా, పబ్లిసిటీ సెల్ చైర్మన్ పవన్ ఖేరా అన్నారు. 2013 లోక్‌సభ ఎన్నికల్లో డిఎంకె తాము ఒంటరిగానే పోటీ చేస్తామని, ఎవరితోనూ పొత్తు లేదని ప్రకటించిందని, దాన్ని తామేమీ వెన్నుపోటుగా మాట్లాడలేదని గుర్తు చేశారు. డిఎంకె తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని హితవు పలికారు.