← Back to headlines

18 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం

2026-05-06 14:38 • original

పలు కార్పొరేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం చైర్మన్లను, వైస్-చైర్మన్లను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్‌గా బస్వరాజు శ్రీనివాస్‌ను, వైస్-చైర్మన్‌గా పొన్నాడ సుబ్రహ్మణ్య ప్రసాద్‌ను నియమించింది. వాషర్‌మెన్ కో-ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్‌గా దాసిరాజు అజయ్ కుమార్, వైస్-చైర్మన్‌గా బంగారు బాబు, గీత కార్మికుల కార్పొరేషన్ చైర్మన్‌గా మోతుకూరి చంద్రశేఖర్ గౌడ్, పెరిక సహకార కార్పొరేషన్ చైర్మన్‌గా డొంగారి వెంకటేశ్వర్లు, మేర సహకార కార్పొరేషన్ చైర్మన్‌గా సంగా వెంకట రాజం, వాల్మికి బోయ కార్పొరేషన్ చైర్మన్‌గా గట్టు తిమ్మప్ప, మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా బొమ్మ శ్రీరామ్, యాదవ సహకార కార్పొరేషన్ చైర్మన్‌గా ఎం. రఘునాథ్ యాదవ్, వడ్డెర సహకార సంస్థ చైర్మన్‌గా గుంజ రేణుక నారాయణ,

చేనేత కార్పొరేషన్ చైర్మన్‌గా దూడెం వెంకటేశ్వర్లు, కమ్మ కార్పొరేషన్ చైర్మన్‌గా బండి రమేష్, పద్మశాలి సహకార సంస్థ చైర్మన్‌గా గూడురు శ్రీనివాస్, భట్టరాజు సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్‌గా సి.హెచ్. బాలరాజు, వెలమ కార్పొరేషన్ చైర్మన్‌గా జువ్వాడి నర్సింగ్ రావు, గొర్రెలు, మేకల కార్పొరేషన్ చైర్మన్‌గా కొల్లె సరిత, లైవ్ స్టాక్ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా చరణ్ కౌశిక్ యాదవ్, తెలుగు అకాడమి చైర్మన్‌గా వెంకట నారాయణ, గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ చైర్మన్‌గా సూదిని రాంరెడ్డి, గ్రామ పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ సభ్యులుగా నగలూరి కృష్ణమోహన్, బూసా వేణుగోపాల్‌ను ప్రభుత్వం నియమించింది. కాగా పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ బుధవారం ఈ జాబితాలను మీడియా ప్రతినిధులకు అందజేశారు.