← Back to headlines

ఏసీబీ వలలో బోధన్ ఎస్‌ఐ..

2026-05-06 14:24 • original

మన తెలంగాణ/బోధన్: బోధన్ పట్టణ పోలీస్‌స్టేషన్లో ఎస్సైగా పని చేస్తున్న భాస్కరాచారి లంచం తీసుకుంటూ బుధవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళితే బోధన్ పోలీస్ స్టేషన్లో కొద్ది రోజులక్రితం ఓ కేసు నమోదైంది. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్‌కు పంపారు. మరి కొంత మంది పేర్లను ఈ కేసులో చేరుస్తామని ఎస్సై భాస్కరాచారి ఫోన్ చేసి బెదిరించడంతోపాటు డబ్బులు డిమాండ్ చేశారు. సదరు వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు ఏసీబీ డీఎస్పీ శేఖర్ రెడ్డి తెలిపారు.

బాధితుని ఫిర్యాదు మేరకు వివరాలను సేకరించగా ఎస్‌ఐ భాస్కరాచారి 10వేల రూపాయలు డిమాండ్ చేయగా ఏడు వేల రూపాయలకు బాధితులు ఒప్పుకోవడం జరిగిందని తెలిపారు. బాధితులు ఏసీబీని ఆశ్రయించగా 7వేలు ఎస్సైకి ఇస్తుండగా పట్టుకొని రిమాండ్‌కు పంపడం జరిగిందని ఏసీబీ డీఎస్పీ తెలిపారు.