
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి టివికె అధినేత విజయ్ ప్రమాణ స్వీకారంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని బుధవారం విజయ్.. గవర్నర్‌ను కోరారు. అయితే, ఇప్పటివరకు గవర్నర్ కార్యాలయం నుంచి విజయ్‌కు ఇంకా పిలుపు అందలేదు. ఇవాళ ఉదయం విజయ్, లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలిశారు. 112 మంది ఎమ్మెల్యేల పేర్లతో జాబితాను గవర్నర్‌కు అందజేసిననట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో మెజార్టీ సంఖ్య చూపించాలని విజయ్‌ని గవర్నర్ అడగగా.. ప్రమాణస్వీకారం తర్వాత బలనిరూపణ చేస్తానని విజయ్ తెలిపినట్లు సమాచారం. కాగా, గురువారం ఉదయం ఉదయం 11 గంటలకు సిఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు విజయ్.. ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు టివికె వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో గవర్నర్ నిర్ణయంపై ఉత్కంఠగా నెలకొంది.