← Back to headlines

IPL 2026: హైదరాబాద్ పై టాస్ గెలిచిన పంజాబ్..

2026-05-06 13:46 • original

ఐపిఎల్ 2026లో మరో రసవత్తర పోరుకు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్లు ఢీకొనబోతున్నాయి. ఇరుజట్లలో దుమ్మురేపే బ్యాటర్లు ఉండటంతో ఈ భీకర పోరు చేసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో టాస్‌ గెలిచిన పంజాబ్ బౌలింగ్‌ ఎంచుకుని.. ముందుగా హైదరాబాద్ జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఈ మ్యాచ్ లో గెలుపొంది ప్రతీకారం తీర్చుకోవాలని సన్ రైజర్స్ హైదరాబాద్ పట్టుదలగా ఉంది.

జట్ల వివరాలు:

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రభ్‌సిమ్రాన్ సింగ్(w), కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్(c), శశాంక్ సింగ్, సూర్యాంశ్ షెడ్జ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, లాకీ ఫెర్గూసన్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(w), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, స్మరణ్ రవిచంద్రన్, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్(సి), శివంగ్ కుమార్, ఈషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్