← Back to headlines

సాధారణ ట్రాఫిక్ లోనే సిఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్

2026-05-07 16:10 • original

సాధారణ ట్రాఫిక్‌లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసానికి చేరుకున్నారు. తన కాన్వాయ్ వెళ్తున్న సమయంలో నగరంలో వాహనాలను నిలిపివేయవద్దని, ఇదే క్రమంలో ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలని ఉన్నతాధికారులను సిఎం రేవంత్ రెడ్డి ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గురువారం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న సిఎం శంషాబాద్ నుంచి తన నివాసం వరకు సాధారణ ట్రాఫిక్ లోనే పయనించారు. సిఎం కాన్వాయ్ వెళ్లే సమయంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా అధికారులు చర్యలు చేట్టారు. ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేయకుండా సింగిల్ లైన్‌లో వాహనాలను అనుమతించారు.

దీంతో సిఎం కాన్వాయ్, సాధారణ ప్రజలు ఎలాంటి అంతరాయం లేకుండానే ప్రయాణం సాగించారు. కాగా, సిఎం ఆదేశాల మేరకు డిజిపి ఆనంద్ హుటాహుటిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ కమిషనర్లు, ఎస్‌పిలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్లే సమయంలో ట్రాఫిక్ ను పూర్తిగా కాకుండా, సింగిల్ లైన్ గా విభజించి వాహనాలను పంపించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటే ప్రత్యామ్నాయ మార్గాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని, ట్రాఫిక్ అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి సత్వర నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.